ఓం నమో లక్ష్మీ నృసింహాయ.
జై నరసింహ జై జై నరసింహ
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే ।
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం ॥
పిట్టలవాని పాలెం మండలం, అల్లూరు
పుణ్యభూమి, వేదభూమి గా ప్రసిద్ధి చెందిన భారత దేశము అనేక పుణ్య క్షేత్రాలకు నెలవు. ఇటువంటి భారతావనిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు దశావతారాలు దాల్చారు. ఆ దశావతారాలలోని నృసింహావతారంలో కొలువైన క్షేత్రమే అల్లూరు శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రము. ఇచట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి భక్తుల పాలిటి కల్పతరువై భక్తవత్సల నరసింహునిగా ప్రసిద్ధి వహించిరి.
ఈ క్షేత్రము నిజాంపట్నం సముద్రపు రేవుకు 5 k.m. దూరంలో ఉంది.
Guntur , Ponnur , Vijayawada, Chirala నుంచి Nizampatnam కు వెళ్శు బస్సుల ద్వారా Alluru చేరుకోవచ్చు.
ఈ క్షేత్రానికి సమీపం లోనే గోకర్ణమఠం అనే శైవ క్షేత్రము కలదు.